మహబూబాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): సీనియర్ నాయకుడు నూకల నరేశ్‌రెడ్డి మరణించారు. సుదీర్ఘ కాలం పాటు వివిధ రాజకీయ పార్టీల పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. నూకల నరేశ్‌రెడ్డి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం. 1989లో కాంగ్రెస్ పార్టీ నుం చి డోర్నకల్ స్థానాన్ని ఆశించి టికెట్ దకలేదు. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు అ నంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరా రు. 1999లో డోర్నకల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చవి చూశారు.
అనంతరం అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2012 ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి 2024 వరకు పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేశారు. 20 24 ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుతం కొనసాగుతున్నారు. జిల్లా లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తుల్లో నూకల నరేశ్‌రెడ్డి ఒకరు. 1995లో రాయపర్తి జడ్పీటీసీగా గెలుపొందారు. నూకల నరేశ్ రెడ్డి మరణంపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన స్వగ్రామం పురుషోత్తమాయగూడెంలో శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి.