మహదేవపూర్, మే 21 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరంలో సరస్వతీ నది అంత్య పుషరాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజైన గురువారం ఉదయం 5:43 గంటలకు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్ వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి తొలి స్నానాన్ని ఆచరిం చి పుషరాలను లాంఛనంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధ ర్, కొండా సురేఖ, పలువురు ప్రజాప్రతినిధు లు, అధికారులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నా రు. తొలిరోజు సుమారు మూడు వేల మంది వరకు భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు చేసి, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఘాట్ల వద్ద చలువ పందిళ్లను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. తాగునీటి కేంద్రాలు, మొబైల్ టాయిలెట్లు, పారిశుధ్య సిబ్బంది, వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుండగా, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయక బృందాలను నియమించింది. 2,500 మంది పోలీసులతో పాటు రెవెన్యూ, వైద్య, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు విధుల్లో పాల్గొంటున్నారు. అంత్య పుషరాలు జూన్ 1 వరకు కొనసాగనుండగా, రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు గురువారం సాయంత్రం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం గర్భగుడిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శుభానందదేవిని దర్శించుకున్నారు. అంతకు ముందు కాళేశ్వరానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్వాగతం పలికారు. పుష్కరాల్లో భాగంగా రూ.1.20 కోట్ల నిధులతో ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన మ్యూజియంను ప్రారంభించారు. సరస్వతీ ఘాట్ వద్ద కాశి వేదపండితులతో నిర్వహించిన నదీ హారతితో పాటు త్రివేణి సంగమంలో తెప్పోత్సవాన్ని వారు వీక్షించారు.
సరస్వతీ అంత్య పుషరాల ఏర్పాట్లలో నిర్ల క్ష్యం బయటపడుతున్నది. తొలిరోజే ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణం చిన్నపాటి గాలి కే విరిగిపడడం తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. ప్రమాద సమయంలో అకడ సంచరిస్తున్న భక్తులకు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పుషరా ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధు లు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, పనుల్లో నాణ్యత దెబ్బతిన్నదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. ఘాట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పలు స్వాగత తో రణాలు కూడా గాలికి వంగిపోతున్నా యి. నాసిరకం సామగ్రితో పనులు చేపట్టడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తు లు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలొని ప్రమాదకరంగా ఉన్న నిర్మాణాలను వెంటనే తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.