ఇనుగుర్తి, మే 27 : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తన ఎంపీ నిధుల నుంచి రూ.కోటీ 25లక్షలు మంజూరు చేశారు. ఇనుగుర్తి మండల ఏర్పాటుకు కృషిచేసిన ఆయన మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నిధులు సమకూర్చి మాట నిలబెట్టుకున్నారు.
వాటిలో మండలకేంద్రానికి రూ.20 లక్షలు, చిన్ననాగారం రూ.20లక్షలు, తార్సింగ్తండా రూ.20 లక్షలు, కోమటిపల్లి రూ.25లక్షలు, చిన్నముప్పారం రూ.15లక్షలు, మీఠ్యాతండా రూ.10 లక్షలు, లక్ష్మీపురం రూ.5లక్షలు, పాతతండా రూ.5లక్షలు, పెద్దతండాకు రూ.5లక్షల చొప్పున ఆయా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించగా నిధుల మంజూ రు పత్రాలను ఎంపీ రవిచంద్ర సోదరుడు కిషన్ మంగళవారం ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులకు అందించారు. నిధులు మం జూరు చేసిన ఎంపీ రవిచంద్రకు, సహకరించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌కు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు దీకొండ వెంకన్న, గుండ వెంకన్న, తొర్రూరు ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కసిరబోయిన విజయ్‌యాదవ్, మాజీ సర్పంచ్ దార్ల రామూర్తి, నీలం యాకయ్య, నారాయణరెడ్డి, బానోత్ నరేశ్‌నాయక్, బానోత్ రాజునాయక్, బానోత్ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బేతమల్ల చంద్రయ్య, నామాల మహేశ్, నాయకులు పింగిళి శ్రీనివాస్, పప్పుల వెంకన్న, గుజ్జునూరి బాబురావు పాల్గొన్నారు.