రైలు కిందపడి రిటైర్డ్ జవాన్ మృతి
అనారోగ్య సమస్యలతో ఓ జీడబ్ల్యూఎంసీ రిటైర్డ్ శానిటేషన్ జవాన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.
- ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆత్మహత్య
ఖిలావరంగల్, జనవరి 27: అనారోగ్య సమస్యలతో ఓ జీడబ్ల్యూఎంసీ రిటైర్డ్ శానిటేషన్ జవాన్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం రాత్రి వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. వరంగల్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ నయీంనగర్కు చెందిన రిటైర్డ్ శానిటరీ జవాన్ గద్వాల ఉప్పలయ్య(75) కొంతకాలంగా బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటూ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఎన్ని మందులు వాడినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన అతడు వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ మధ్య 370/29 మైలు రాయి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉప్పలయ్య శరీరం లోకో ఇంజిన్కు చిక్కుకొని జమ్మికుంట రైల్వేస్టేషన్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. శరీరం సగం వరకు తెగిపోయి అక్కడక్కడా ముక్కలు పడిపోగా, సగభాగం జమ్మికుంట రైల్వేస్టేషన్లో పడిపోయింది. వరంగల్ రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జమ్మికుంట ప్రభుత్వ దవాఖానలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

