హనుమకొండ, మే 12 : సోమవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాలుగు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అమలుచేసిన స్లాట్ బుకింగ్ విధానం ద్వారా మొత్తం 142 రిజిస్ట్రేషన్లు అయినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శా ఖ అధికారులు తెలిపారు. ఇందులో జనగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 25, స్టేషన్ ఘన్పుర్లో 22, వరంగల్ ఆర్వో ఆఫీసులో 71, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 24 రిజిస్ట్రేషన్లు జరిగి డాక్యుమెంట్లు సైతం అందజేశారు.
స్లాట్ విధానం వల్ల గంటల తరబడి వేచి ఉండే అవసరం లేదు. సమయానికి క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి అరగంటలో ప్రక్రియ పూర్తి చేసుకొని డాక్యుమెంట్ తీసుకొని వెళ్లవచ్చు. దీని వల్ల సమయం ఆదా కావడం, వెనువెంటనే డాక్యుమెంట్ చేతికొస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా గత నెలలోనే వరంగల్ రూర ల్, ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇప్పటికే ప్రారంభించారు.
జూన్ నుంచి ఉమ్మడి జిల్లాలోని మిగితా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానున్నట్లు తెలిసింది. ఒక వరంగల్ ఆర్వో ఆఫీసులో తప్ప ఉమ్మడి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఒక్కొక్క దానిలో 48 రిజిస్ట్రేషన్లకు ఎక్కువ చేయ రు. వరంగల్ ఆర్వో ఆఫీసులో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నందున 96 రిజిస్ట్రేషన్లకు పరిమితం చేసినట్లు అధికారులు తెలిపారు. అధికారులు రాత్రి వరకు ఉండాల్సిన పనిలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.