కురవి, జూలై 25: రామప్పను వారసత్వ సంపదగా గుర్తించి ఏడాదైన సందర్భంగా ఓ కళాకారుడు నాగిని శాశ్వత సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు. మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన ఈ శిల్పి నీలం శ్రీనివాసులు.. రామప్ప కళాసంపదలో ఉన్న నాగినిని పోలే శిల్పాన్ని తయారుచేశాడు. ఈయన సిద్దిపేట జిల్లా అగ్రహారం డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
25 జూలై 2021వ తేదీ కళాకారులకు ఎనలేని ఖ్యాతి తెచ్చిన రోజుగా చరిత్రలో మిగిలిపోతుందని శ్రీనివాసులు అభిప్రాయపడ్డాడు. 800 సంవత్సరాలకు ముందు కాకతీయుల కళాపోషణను…కళాకారుడు రామప్ప గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేలా యునెస్కోలో చోటు దక్కిందన్నారు. రామప్పను వారసత్వ సంపదగా గుర్తించడమంటే తెలంగాణలో ప్రతి కళాకారుడికి దక్కిన విజయంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. నాగిని శాశ్వత సైకత శిల్పాన్ని తయారుచేసేందుకు 20రోజులపాటు రోజుకు ఐదు గంటల సమయం పట్టిందన్నారు.