పోచమ్మమైదాన్, నవంబర్ 17 : ప్రముఖ కవి రామా చంద్రమౌళికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన సాహితీ సేవలను గుర్తించిన ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులు జీవన సాఫల్య పురస్కారం ప్రకటించారు. ఈ నెల 22, 23వ తేదీల్లో దోహా (ఖతార్)లో జరుగనున్న సదస్సులో రామా చంద్రమౌళికి ఈ అవార్డును అందజేయనున్నారు.
వరంగల్ పోచమ్మమైదాన్కు చెందిన రామా చంద్రమౌళి ప్రొఫెసర్గా విద్యార్థులకు సేవలందించడంతో పాటు కవి, రచయితగా సాహితీ సేవకు అంకితమయ్యారు. ఇంతవరకు 78 గ్రంథాలను ప్రచురించిన చంద్రమౌళి 34 నవలలు, 427 కథలు, 16 కవిత్వ సంపుటాలు, 3 నాటకా లు, 4 విమర్శన గ్రంథాలు వెలువరించారు. వివిధ దేశాల్లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో పాల్గొని తన కవితలను వినిపించారు.
2020లో రాష్ట్ర అత్యున్నత సాహిత్య అవార్డు కాళోజీ పురస్కారాన్ని మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. 2007లో తెలుగు విశ్వవిద్యాలయం, 2008లో సినారే, 2012లో డాక్టర్ సోమసుందర్ , కొలకలూరి భాగీరథీ, 2015లో గుంటూరు శేషేంద్రశర్మ కవిత్వ పురస్కారంతో పాటు ముంబై, ఫిలిప్పీన్స్ ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2022 జూలై 7న తెలుగు విశ్వవిద్యాలయం ఆయన రచించిన బృహత్ నవల కాలనాళికకు 2019కి సంబంధిం చి ఉత్తమ నవలా పురస్కారాన్ని అందజేసి గౌరవించింది.
2019లో ప్రపంచ వ్యాప్తంగా సాహితీవేత్తల నుంచి 2386 ఎంట్రీలను పరిశీలిం చి, నాజీ నామన్, లెబనాన్ ప్రపంచస్థాయి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని చంద్రమౌళికి అందజేశాయి. ఆ నాడు భారత్ నుంచి ఒక్క రామా చంద్రమౌళికి మా త్రమే దక్కడ విశేషం. ఆయన రచించిన కథలు, కవి త్వం, నవలలు అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడి, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.