బచ్చన్నపేట జూన్ 8 : బచ్చన్నపేటకు చెందిన బోమెల్లా బాలనర్సయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె భవానీ వివాహానికి వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి పుస్తె మట్టెలను వాస్విక్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆముదాల భూపాల్ రెడ్డి, నూకల బాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. పుస్తె మట్టెలు అందించిన ఫౌండేషన్ సభ్యులకు బాలనర్సయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే పడమటికేశవపూర్ గ్రామంలోని గండు కనకయ్య- వినోద దంపతుల కూతురు రిచా వివాహానికి వాస్విక్ ఫౌండేషన్ తరఫున పుస్తె మట్టెలు అందజేశారు. కార్యక్రమంలో చల్ల శ్రీనివాస్ రెడ్డి, శివరాత్రి మహేష్, రాజుపేట గోపాల్, గర్నేపల్లి వేణు, ఎర్రోళ్ల మహేష్, తమ్మల పరమేశ్వర్, గంగరబోయిన నవీన్, వేముల చందు పాల్గొన్నారు.