నల్లబెల్లి : సామాజిక ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శత జయంతి ( Omkar Jayanthi ) ఉత్సవాల పోస్టర్ను ( Poster ) ఎంసీపీఐ ( యూ ) మండల సహాయ కార్యదర్శి మార్త నాగరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న నల్లబెల్లి మండల కార్యదర్శి దామా సాంబయ్య మాట్లాడుతూ అమరజీవి మద్ధికాయల ఓంకార్ తన జీవిత కాలమంతా బడుగు, బలహీన వర్గాల సామాజిక అభివృద్ధి కోసం నిత్యం పోరాటాలను కొనసాగించారని వెల్లడించారు.
ఓంకార్ పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని, బీసీలకు చట్ట సభలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముందుకు రావడం ఓంకార్ పోరాటమేనని వెల్లడించారు. మే 12వ తేదీన మచ్చాపూర్ వద్ద ఏర్పాటుచేసిన ఓంకార్ స్మారక స్తూపం శత జయంతి ప్రారంభ సభ ఉంటుందని తెలిపారు. సభను విజయవంతం చేయడానికి విద్యార్థులు, యువకులు, సామాజిక ఉద్యమ కారులు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ఎద్దు ఆగయ్య, శ్రీకాంత్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.