హనుమకొండ రస్తా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదివాసీల ప్రత్యేక చట్టాలను (Tribals Issues) , హక్కులను, జీవోలను ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధక్షుడు లోకిని రాజు( Lokini Raju) మండిపడ్డారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన బీసీ జనాభా ప్రతిపాదిక మీద 42 శాతం రిజర్వేషన్ సాధనకు , కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు పోరాటం చేసేందుకు కార్యాచరణను రూపొందిచామని వెల్లడించారు.
ఈనెల 25న నిజామాబాద్ జిల్లా నుంచి మొదలుకొని తెలంగాణ 33 జిల్లాల్లో జాగృతి జనంబాట నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కురుసాంగి వేణు, జాగృతి ఆటో యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కేతిరి సంతోష్‌కుమార్, లోకిని సమ్మయ్య, ఓని సదానందం, బూనాద్రి రంజిత్, పాలకుర్తి నారాయణ, విజేందర్, రఘు, దేవేంద్రనాయక్, రాజేందర్, సురేందర్ పాల్గొన్నారు.