హనుమకొండ రస్తా, నవంబర్ 19 : వరంగల్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 10,11,12 తేదీలలో నిర్వహించే పీడీఎస్యూ 23వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పీడీఎస్యూ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు రాచర్ల బాలరాజు పిలుపునిచ్చారు. హనుమకొండ ఆర్ట్స్కాలేజ్ సెంటర్లో వాల్ రైటింగ్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 10,11,12వ తేదీలలో విప్లవాల ఖిల్లా వరంగల్ జిల్లాలో నిర్వహించబోయే తెలంగాణ రాష్ర్ట 23వ పీడీఎస్యూ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థి, మేధావి వర్గాలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సభల విజయవంతం కోసం ఆర్థికంగా హార్దికంగా సకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పీడీఎస్యూ అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేష్, జిల్లా నాయకులు అజయ్, రాజేష్ అనిల్, కళ్యాణ్, శ్యామ్ పాల్గొన్నారు.