వరంగల్ : జిల్లాలోని నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామం నుంచి చెన్నారావుపేట మండలంలోని కోనాపురం గ్రామ వరకు రూ. 6.59 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ రోడ్డు నిర్మాణంతో నర్సంపేట, చెన్నారావుపేట మండలాల్లోని మహేశ్వరం, రామ్ నాయక్ తండా, గురిజాల, జిజిఆర్ పల్లి, లింగాపురం, కోనాపురం తదితర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పడనుందని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.