సంగెం, ఏప్రిల్ 3: ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్‌కు హైదరాబాద్ వేదికైంది. దేశవ్యాప్తంగా కళాకారులు గీసిన చిత్రాల ను ఇందులో ప్రదర్శించనున్నారు. తమ కళాత్మక చిత్రాలను ప్ర పంచానికి పరిచయం చేయడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెషన్ సెం టర్ వేదికపై మండలంలోని ముమ్మిడివరం గ్రామానికి చెం దిన కళాకారుడు కాగితాల పూర్ణమాచారి గీసిన చిత్రాలు ప్ర దర్శనకు ఎంపికయ్యాయి.
పూర్ణమాచారి బూత్ నంబర్ 57 లో రెండు చిత్రాలను ప్రదర్శనలో ఉన్నాయి. దేశంలోని వివి ధ రాష్ర్టాలకు చెందిన కళాకారులు తాము గీసిన చిత్రాలను ప్రదర్శనలో పెట్టినట్లు పూర్ణమాచారి తెలిపారు. 30 గ్యాలరీల్లో 80 బూత్‌లు, 300 మంది ఆర్టిస్టులు, 3 వేల చిత్రాలు ఈ ఫెస్టివల్లో ఉన్నాయన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పూర్ణమాచారి గీసిన చిత్రాలు ప్రదర్శించడంపై గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.