ఖిలా వరంగల్, జూన్ 5 : మామునూరు ఎయిర్‌పోర్టు భూ సేకరణపై గురువారం వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో గాడిపల్లి ప్రాంతంలో వ్యవసాయేతర భూమి కోల్పోయిన వారితో పరిహారం చెల్లింపుపై చర్చించారు. వ్యవసాయేతర భూమికి చదరపు గజానికి రూ.4887 ధర నిర్ణయించారు.
మొత్తం 50 మంది భూ యజమానుల నుంచి 61,134.5 చదరపు గజాల స్థలాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వర్, భూసేకరణ సూపరింటెండెంట్ శ్రీకాంత్, డీటీ త్రినాథ్‌రెడ్డి, ఈఈ ఇరిగేషన్ శంకర్, ఆర్అండ్డీ డీఈ దేవికా చౌహాన్, గాడిపెల్లి భూనిర్వాసితులు పాల్గొన్నారు.