నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో శుక్రవారం సాంకేతిక సంబురం అంబురాన్నంటింది. మూడు రోజులపాటు జరుగునున్న టెక్నోజియాన్-2022కు దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అతి పెద్ద సాంకేతిక సంబురంగా పేరుగాంచిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులే నిర్వహిస్తున్నారు. నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు, మనోభావాలను పంచుకున్నారు. – నయీంనగర్, డిసెంబర్16
వివిధ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో జ్ఞానాన్ని సమీకరించడానికి, పంచుకోవడానికి వరంగల్ నిట్‌లో నిర్వహిస్తున్న టెక్నోజియాన్-2022 వేదికైంది. నేటి నుంచి మూడు రోజులపాటు సాంకేతిక పండుగను జరుపనున్నారు. వరంగల్ విద్యార్థులు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈవెంట్లు, వర్షాప్లు, అతిథి ఉపన్యాసాలు ఉంటాయి. సాంకేతికోత్సవానికి దేశంలోని ఇంజినీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు శుక్రవారం తరలివచ్చారు. వివిధ అంశాలపై వారు రూపొందించిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నా యి. 35 ఈవెంట్లకు పైగా ప్రదర్శించారు. వీటిని సుమారు 1000 మంది విద్యార్థులు ఆసక్తిగా తిల కించారు. టెక్నో జియాన్‌లో పాల్గొనే వారికి సాంకేతిక అద్భుతాల జ్ఞాపకాలు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందించనున్నాయి. వర్షాప్లు, బూట్ క్యాంపులు, ఇతర వినోదాత్మక ఈవెంట్ల ద్వారా తాజా సాంకేతిక ఆవిషరణలపై జ్ఞానాన్ని పంచుకోవడానికి విద్యార్థులకు ఉపయుక్తం కానున్నది.
స్టూడెంట్ కార్ రేసింగ్
ఏటా నిట్ వరంగల్‌కు చెందిన బీటెక్ విద్యార్థులు ఫార్ములా స్టూడెంట్ రేసింగ్ కార్‌ను తయారు చేస్తా రు. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సుప్రా సా ఇండియా నిర్వహించిన జాతీయ స్థ్ధాయి పోటీలో పాల్గొని 17వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ టెక్నోజియాన్‌లో రేస్కారును ప్రదర్శనకు పెట్టారు.
హ్యాకింగ్ ఎలా చేస్తారంటే..?
హ్యాకింగ్ ఎలా చేస్తారు? ఏ విధంగా హ్యాక్ అవుతుందని వివరించారు. వైఫై పాస్వర్డ్, యూఎస్బీ (పెన్‌డ్రైవ్), రేడియో హైజాకింగ్ వంటి వాటిని కూడా డెమో చేసి విద్యార్థులకు చేసి చూపించారు.
డేర్ టు ఫీల్ ద చైర్
అమ్మాయిలకు రుతు స్రావంలో వచ్చే నొప్పి ఎలా ఉంటుందో ప్రయోగాత్మకంగా అబ్బాయిలకు చేసి చూపించారు. ఇందుకోసం ‘డేర్ టు ఫీల్ ద చైర్’ అనే టెన్స్ మెషిన్‌ను నిట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ మూడో సంవత్సరం విద్యార్థులు తయారుచేశారు. ఇందులో 1 నుంచి 10 లెవల్స్ ఉంటాయి. చైర్లో అబ్బాయిలను కూర్చోబెట్టి ఒక్కో లెవల్ మార్చుతారు. 6వ లెవల్‌కు రాగానే ఈ నొప్పిని భరించలేమని, అమ్మాయిల పరిస్థితిని వారు అర్థం చేసుకుంటారు.
రోబోటిక్
స్మార్ట్‌ఫోన్ నుంచి రోబోటిక్ వరకు విద్యార్థులు ప్రదర్శనలిచ్చారు. ఇందులో స్మార్ట్‌ఫోన్ గేమ్స్, ఫామ్ రోబో, కెమెరా చార్జింగ్, రైటింగ్ రోబో, ఏటీఏం మెషిషన్, హోమ్ ఆటో మెషిన్, సోలార్ కారుతో పాటు రోబో ఎక్సర్సైజ్ వంటివి తయారుచేశారు. విద్యార్థులు తమ ప్రతిభతో చేసిన పరికరాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.