పోచమ్మమైదాన్ : ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌కు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని ప్రకటించారు. తెలుగు ప్రపంచంలో 34 నవలలు, 8 కథా సంపుటాలు, 5 వ్యాస సంపుటాలు వెలువరించిన గొప్ప రచయిత, ఓరుగల్లు సాహితీ కిరణం అంపశయ్యను గుర్తించి ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పురస్కారాన్ని ఇవ్వనున్నారు.
వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం, మిమిక్రీ అర్టిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ్ జయంతి సందర్భంగా ప్రదానం చేయనున్నారు. 28న హనుమకొండలోని వేణుమాధవ్ కళా ప్రాంగణంలో అవార్డును నవీన్‌కు అందజేయనున్నారు.