హనుమకొండ చౌరస్తా, నవంబర్ 10 : కొత్త ఆవిష్కరణలు.. సరికొత్త ఇన్నోవేషన్స్‌తో వరంగల్ నిట్ క్యాంపస్‌లో టెక్నోజియాన్-24 సాంకేతిక సంబురం ముగిసింది. మూడు రోజుల పాటు విద్యార్థులు ఆధునిక టెక్నాలజీని జోడించి పలు పరికరాలను రూపొందించి ఔరా అనిపించారు. టెక్నోజియాన్ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా నిట్ విద్యార్థులకు డీజే నైట్ నిర్వహించారు. వోల్టేజ్ వోర్టెక్స్ పేరుతో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సొసైటీ నిర్వహించిన ట్రెజర్ హంట్ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే ప్రోడక్ట్ లాంచ్ ఈవెంట్, లేజర్లను తాకకుండా ముందుకు సాగడం(లాబ్రింత్ ఈవెంట్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలక్ట్రానిక్ అమెచ్యూర్స్ హామ్ క్లబ్ ద్వారా ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.
నాణెం వేస్తే చాక్లెట్ వచ్చే మిషన్(చాక్లెట్ డిస్పెన్సర్)ను క్రియేటివ్ రోబోటిక్స్ క్లబ్ రూపొందించింది. మెకానికల్ ఇంజినీరింగ్ సొసైటీ మెకానికల్ కిట్ అసెంబ్లీ నిర్వహించగా, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖగోళశాస్త్రం, గ్రహాల గురించి తెలియజేసే వండర్ కాస్మోస్ ఈవెంట్‌ను ఆస్ట్రానమీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాథమిక జీవశాస్త్రానికి సంబంధించి బయోటెక్ సొసైటీ నిర్వహించిన సెల్యూషన్ ఈవెంట్ అందరినీ ఆలోచింపజేసింది. అలాగే ఈ గేమ్స్ ఏ స్పాట్ లైట్ ఈవెంట్లో భాగంగా పలువురు కంప్యూటర్ గేమ్ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు.
టెక్నోజియాన్‌లో భాగంగా మూడో రోజు రాత్రి 7 గంటలకు డీజే మోత మోగింది. నిట్ క్యాంపస్‌లోని ఆడిటోరియం ఎదురుగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు యువత ఊర్రూతలూగారు. స్టెప్పులేస్తూ అందరినీ ఉత్సాహరిచారు. కేరింతలు కొడుతూ డీజే పాటలకు డ్యాన్స్ చేశారు. సరదాగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు.