నర్సంపేట, అక్టోబర్ 21 : నిరు పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని నర్సంపేట ఎమ్మెలల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిమోజకవర్గానికి చెందిన 126 మంది లబ్ధిదారులకు రూ.47లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటుందని తెలిపారు. ఈ దేశంలో సీఎంఆర్ఎఫ్ కింద ఎక్కువ మొత్తంలో పేదలకు డబ్బులు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గం 3వ స్థానంలో ఉందన్నారు. రూ. 60కోట్లకు పైగా విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.
డీసీసీబీ నర్సంపేట బ్రాంచ్ ప్రారంభం..
డీసీసీ బ్యాంక్ నర్సంపేట బ్రాంచ్‌ను ఎమ్మెల్యే పెద్ది శుక్రవారం ప్రారంభించారు. బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే పట్టణంలో డీసీసీ బ్యాంక్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజిని, పార్టీ పట్టణాధ్యక్షుడు నాగెళ్లి వెంకటనారాయణ గౌడ్ పాల్గొన్నారు.