Dandruff | చుండ్రు అసలు ఎందుకు వస్తుంది.. ఈ ఒక్క పదార్థంతో సమస్యకు చెక్ పెట్టవచ్చు..
చుండ్రు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ తల చర్మ సమస్య. తలలో దురద, తెల్లని పొరలు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా కనిపించడం వంటి లక్షణాలు దీనివల్ల కనిపిస్తాయి. చుండ్రుకు ప్రధాన కారణాల్లో ఒకటి మలాసెజియా అనే ఫంగస్ అధికంగా పెరగడం. ఈ సమస్యను తగ్గించడంలో నిమ్మకాయను సహజసిద్ధమైన గృహచికిత్సగా చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు.
Dandruff | చుండ్రు చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ తల చర్మ సమస్య. తలలో దురద, తెల్లని పొరలు రాలిపోవడం, జుట్టు నిర్జీవంగా కనిపించడం వంటి లక్షణాలు దీనివల్ల కనిపిస్తాయి. చుండ్రుకు ప్రధాన కారణాల్లో ఒకటి మలాసెజియా అనే ఫంగస్ అధికంగా పెరగడం. ఈ సమస్యను తగ్గించడంలో నిమ్మకాయను సహజసిద్ధమైన గృహచికిత్సగా చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్, యాంటీ మైక్రోబియల్ గుణాలు తల చర్మాన్ని శుభ్రపరచడంతోపాటు ఫంగస్ పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. నిమ్మరసంతోపాటు ఉసిరికాయ రసం కలిపి ఉపయోగించడం చుండ్రు తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసానికి రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ రసం కలిపి కాటన్ సహాయంతో తల చర్మానికి పట్టించాలి. సుమారు 30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఈ మిశ్రమం తల చర్మంలోని మృతకణాలను తగ్గించడంతోపాటు జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడుతుంది.
పెరుగు లేదా తేనె..
పెరుగుతో నిమ్మరసం కలిపి వాడటం కూడా చుండ్రును తగ్గించేందుకు మంచి మార్గంగా చెప్పవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తల చర్మానికి పట్టించి 30 నిమిషాల తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేయాలి. పెరుగులోని సహజ ఎంజైములు, నిమ్మలోని ఆమ్ల గుణాలు కలిసి చుండ్రును తగ్గించడంతోపాటు జుట్టును మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి. నిమ్మరసం, తేనె కలయిక కూడా తల చర్మానికి మేలు చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంలో మూడు టేబుల్ స్పూన్ల తేనె కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి. తేనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఫంగస్ పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే తల చర్మాన్ని తేమగా ఉంచి పొడిబారడం, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. మంచి ఫలితాల కోసం మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి ఉపయోగించవచ్చు.
గుడ్డు లేదా టీ డికాక్షన్..
గుడ్డు, నిమ్మరసం మిశ్రమం కూడా జుట్టు సంరక్షణలో ఉపయోగపడుతుంది. ఒక గుడ్డును బాగా గిలక్కొట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని తల చర్మానికి పట్టించి 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి. గుడ్డు సహజ కండిషనర్‌గా పనిచేయడంతోపాటు మృతకణాలను తొలగించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టీ డికాక్షన్‌తో నిమ్మరసం కలిపి ఉపయోగించడం కూడా చుండ్రును తగ్గించడంలో ఉపకరిస్తుంది. రెండు టీ స్పూన్ల టీ పొడిని అర కప్పు వేడి నీటిలో మరిగించి వడకట్టాలి. చల్లారిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి తల చర్మానికి పట్టించాలి. సుమారు 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయాలి. టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, నిమ్మలోని యాంటీ మైక్రోబియల్ గుణాలు కలిసి తల చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే నిమ్మరసం నేరుగా తలకు ఉపయోగించే ముందు చిన్న భాగంలో పరీక్షించడం మంచిది. తల చర్మంపై గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన దురద ఉంటే ఈ చిట్కాలను ఉపయోగించే ముందు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం అవసరం. చుండ్రు ఎక్కువకాలం కొనసాగినా లేదా తీవ్రమైనా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- dandruff
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

