Akhil Akkineni | అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ సినిమా జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు అఖిల్. ఇక చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్ రీసెంట్ ఇండస్ట్రీ హిట్ ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అందులో సమంత నటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘లెనిన్’ ప్రమోషన్స్ బిజీ వల్ల తాను ఇంకా ‘మా ఇంటి బంగారం’ సినిమా చూడలేదని, కానీ ఆ చిత్ర ట్రైలర్ చూశానని అఖిల్ వెల్లడించారు. ట్రైలర్ వైబ్ అద్భుతంగా ఉందని, చూసినప్పుడే ఇది కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని తనకు అనిపించిందని చెప్పారు. ఒక మంచి ఇంటికి కోడలిగా వెళ్లి, ఆ కుటుంబ సభ్యులందరితో బంగారం అనిపించుకోవాలనే చక్కటి ఫ్యామిలీ ఎలిమెంట్‌కు పవర్ఫుల్ యాక్షన్‌ను జోడించి సినిమాను చాలా కొత్త కాన్సెప్ట్‌తో, సహజంగా తెరకెక్కించారని ఆయన ప్రశంసించారు.
ముఖ్యంగా ఒక మహిళా ప్రధాన పాత్రతో ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతమని కొనియాడారు. ఈ చిత్రంలో సమంత పాత్రను అద్భుతంగా పండించిందని మెచ్చుకుంటూ, కంగ్రాట్స్ సామ్ అంటూ సమంతతో పాటు ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందానికి అఖిల్ తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. విడాకుల తర్వాత కూడా అక్కినేని కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా అఖిల్‌తో సమంతకు ఉన్న ఈ రిలేషన్ పరస్పర గౌరవం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.