న్యూయార్క్: అమెరికాలోని టిబెట్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం(UN Headquarters) ముందు ఈ ఘటన జరిగింది. టిబెట్ దేశ జెండాను పట్టుకుని అతను తనను తాను కాల్చుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 52 ఏళ్ల వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతను మరణించినట్లు న్యూయార్క్ పోలీసు శాఖ వెల్లడించింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అతని ప్రాణాలను రక్షించలేకపోయారు. ఒంటికి నిప్పు అంటించుకుని సజీవ దహనమైన ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే దేని వల్ల ఆ వ్యక్తి ఒంటికి నిప్పు అంటించుకున్నాడో తెలియదని అధికారులు చెప్పారు. ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు. షెడ్యూల్ ప్రకారం ఆ రోజు జరగాల్సిన సమావేశాలు పూర్తి అయిన తర్వాత ఆ ఘటన జరిగినట్లు యూఎన్ ప్రతినిధి తెలిపారు.
13వ శతాబ్ధం నుంచి టిబెట్ తమ దేశంలో భాగమని చైనా చెబుతున్న విషయం తెలిసిందే. 1951 నుంచి ఆ హిమాలయ ప్రాంతాన్ని కమ్యూనిస్టు పార్టీ తమ ఆధీనంలో ఉంచుకున్నది. కానీ టిబెట్ ప్రజలు మాత్రం తాము స్వతంత్రులం అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. తమ సంస్కృతి, వారసత్వాన్ని అణిచివేసి, తమ వద్ద ఉన్న వనరులను దోచుకెళ్లాలని చైనా చూస్తున్నట్లు టిబెటన్లు వాదిస్తున్నారు. టిబెట్ ప్రభుత్వాన్ని చైనా గుర్తించడం లేదు. 2010 నుంచి దలైలామా ప్రతినిధులతో ఆ దేశం చర్చలు జరపడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
Over 160 Tibetans self-immolated in occupied #Tibet, crying out against #China’s repression, cultural genocide & Ethnic Unity Law.
Today Self Immolation reached in front of #UnitedNations, their sacrifice exposes decades of suffering. Our non-violent struggle will NEVER end until… pic.twitter.com/bUOzhRCVpQ— Tibet People 🇺🇦 (@TibetPeople) July 3, 2026