వరంగల్ : వరంగల్ తూర్పు నియోజక వర్గం అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని 36 వ డివిజన్ చింతల్ ఎస్సీ కాలనీతో పాటు పలు కాలనీలను ఎమ్మెల్యే అధికారులు, డిప్యూటి మేయర్ రిజ్వానా షమీమ్తో కలిసి పరిశీలించారు.
శానిటేషన్, వాటర్ సప్లై, మురికి కాలువల నిర్మాణం,రోడ్ల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.
వారికి పలు సూచనలు చేసారు. గడప గడపకు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నామన్నారు. వార్డులలో పనులు పూర్తి చేస్తు ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంలో ఈ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలకి దీటుగా అభివృద్ది చేస్తామన్నారు.