మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 21 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని ముస్లిం ఐక్య వేదిక ఆద్వర్యంలో మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌తో పాటు ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల సంఘాల నాయకులు మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు రక్షణ లేకుండా వారి ఆస్తులను హరించే విధంగా ఉందని, వెంటనే ఈ బిల్లును రద్దు చేయాలని ముస్లిం ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముస్లిం పరిరక్షణ కమిటీ ఐక్య వేదిక నాయకుడు ఇక్బాల్, ఎండీ ఫరీద్, ఖలీల్, యూసుఫ్, మదార్, షేక్ ఖాదర్ బాబా, యాకుబ్, ఇమ్రాన్, అబ్దుల్ పాల్గొన్నారు.