Minister Sitakka | ములుగు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్.. ఎవరూ బయటకు రావొద్దు : మంత్రి సీతక్క
Minister Sitakka | వాతావరణశాఖ హెచ్చరికల మేరకు ములుగు జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ అయినందున అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ప్రజలకు సూచించారు.
ములుగు : వాతావరణశాఖ హెచ్చరికల మేరకు ములుగు (Mulugu) జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ (Orange alert ) జారీ అయినందున అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క (Minister Sitakka) ప్రజలకు సూచించారు. ఆదివారం ఆమె ములుగు మండలం లోని జాకారం, గట్టమ్మ మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను, వరద ఉధృతిని ఆమె పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Rains) ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ రహదారి (National Highway) పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజలకు రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లవద్దన్నారు. లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించి విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

