Bade Chokka Rao | దళ కమాండర్ నుంచి అంచలంచెలుగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగాడు మాజీ మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్. ఆపరేషన్ కగార్ నేపథ్యంలో రెండు నెలల క్రితం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట బడే చొక్కారావు తన సహచరులతో కలిసి లొంగిపోయాడని తెలిసిందే.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు 30 ఏండ్ల తర్వాత తన తల్లిని కలుసుకున్నాడు. స్వగ్రామంలోని నివాసానికి వెళ్లిన బడే చొక్కారావు తన తల్లిని కలిశాడు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. సుదీర్ఘ కాలం తర్వాత స్వస్థలానికి వచ్చిన బడే చొక్కారావును చూసేందుకు చాలా మంది నివాసానికి వచ్చారు.
Hot Adilabad | ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్
Jailer 2 | ఎట్టకేలకి జైలర్ 2 షూటింగ్ పూర్తి.. రజనీకాంత్ అభిమానుల్లో పెరిగిన అంచనాలు
Earthquake | ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు