రఘునాథపల్లి జులై 16 : ఓ తల్లి పేగు బంధా న్ని తెంచుకుం టూ పసికందు ను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోగా, స్థానికులు అక్కున చేర్చుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో రోడ్డు పక్కన గుర్తుతెలియని మహిళ పసికందును వదిలేసి వెళ్లింది. తెల్లవారుజామునే అప్పుడే పుట్టిన మగ శిశువు రోడ్డుపై గుకపెట్టి ఏడుస్తుండడంతో స్థానికులు చలించిపోయారు.
ఓ వృద్ధురాలు పసికందును చేరదీసి స్నానం చేయించింది. బిడ్డ తల్లిదండ్రుల కోసం చుట్టుపకల వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో గ్రామ పెద్దలు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. శిశువును వదిలేసిన వారు చుట్టుపకల వారా? లేదా దూరం ప్రాంతం నుంచి వచ్చి ఇకడ వదిలారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్త్తున్నారు. అనంతరం శిశువును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించగా, జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌లో చేర్పించారు. శిశువుకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్, డాక్టర్ ఉదయ్ వైద్య పరీక్షలు చేశారు.