వరంగల్, డిసెంబర్ 1 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సా గింది. సోమవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగిన బల్దియా సమావేశం వాడీవేడిగా సాగింది. కమ్యూనిటీ హాళ్లను బల్దియా స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశా లపై మేయర్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్లపై ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేశంతో ఊగిపోతూ ఎజెండా కాపీలను చించివేశారు. అభివృద్ధిపై స్పందించని కౌన్సిల్ ఎందుకని ప్రశ్నించారు. తాను కౌన్సిలర్‌గా మూడు సార్లు, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశానని, తాను సిఫారసు చేసిన దానిని తొక్కిపెట్టడంపై మండిపడ్డారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని 5147 ట్రెడ్ లైసెన్స్‌లు తీసుకున్న వ్యాపారాలు మూసివేసినట్లు గుర్తించి,
వాటికి సంబంధించిన రూ. 5.11 కోట్ల బకాయిలను మాఫీ చేసే అంశాన్ని పలువురు కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అయినప్పటికీ దానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సమావేశంలో విపక్ష పార్టీల సభ్యులకు మా ట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇటీవల మరణించిన ప్రజా కవి అందెశ్రీ కౌన్సిల్ సంతాపం ప్రక టించింది. సమావేశంలో వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, అన్ని విభాగాల వింగ్ అధికారులు పాల్గొ న్నారు. కాగా, బందోబస్తు పేరిట పోలీసుల అత్యుత్సహంపై ఎమ్మెల్సీ సారయ్య మండిపడ్డారు. కార్పొరే టర్లను సైతం నిలిపివేయడం, తనిఖీలు చేయడంపై మట్టెవాడ సీఐ కరుణాకర్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటీ నిర్బంధం, తెలంగాణ ఉద్యమ సమయం, నక్సలెట్ల కాలంలో కూడా ఇంత నిర్బంధం లేదని ఊగిపోయారు.
ఒక వైపు బల్దియా కౌన్సిల్ సమావేశం జరుగుతుంటే.. మరో వైపు బయట 27వ డివిజన్ పరిధిలోని అబ్బనికుంటకు చెందిన ప్రజలు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్‌కుమార్ నేతృత్వంలో ధర్నా చేశారు. అభివృద్ధి పేరిట ఉన్న రోడ్లను తవ్వి గుంతలమయం చేశారని, పనులు చేయకుండా మధ్యలోనే రోడ్ల నిర్మాణాలు నిలిపివేశారని వారు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వాదం జరిగింది.
ప్రతి డివిజన్‌కు రూ. 50 లక్షల నిధులు కేటాయించారు. గ్రేటర్‌లోని 66 డివిజన్లలో రూ. 130 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 39 ఎజెండా అంశాలకు ఆమోద ముద్ర వేశారు. జల్ హీ అమృత్ పథకం కింద మంజూరైన రూ.3 కోట్ల నిధులతో పలు ఫిల్టర్ బెడ్లలో చేపట్టే పనులు, 15వ ఫైనాన్స్‌కు సంబంధించిన రూ. 2.80 కోట్లతో రెండు కంపాక్టర్ వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది.