మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 13 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గూండా రాజకీయాలు చేస్తున్నదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీశ్‌రావును అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎమ్మార్వో సెంటర్ నుంచి ర్యాలీగా మదర్ థెరిస్సా సెంటర్‌కు చేరుకొని రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్.. కాంగ్రెస్ గూండాయిజం పోవాలి, బీఆర్ఎస్ నాయకులుపై పోలీసులు జులుం నశించాలి, ప్రజాస్వామిక విలువలను కాపాడాలి అంటూ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అరెకపుడి గాంధీతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ గూండాలతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిని ముట్టడించి ఇంటిని ధ్వంసం చేయడం దారుణమని మండిపడ్డారు. భద్రత కల్పించాల్సిన పోలీసులే కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి మద్దతుగా పనిచేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారని, దీనికి పోలీసులు మద్దతుగా నిలువడం సరికాదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్ట్ అంటే గౌరవం లేదని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించరా, నామినేషన్ వేయని వారికి చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారని ప్రశ్నించారు. అంతేగాక జిల్లాల్లో మండల, గ్రామస్థాయి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి, బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, మార్నేని వెంకన్న, మంగళంపల్లి కన్న, జేరిపోతుల వెంకన్న, బానోత్ రవికుమార్ ఎడ్ల వేణుమాధవ్, నాయిని రంజిత్‌కుమార్, లునావత్ అశోక్‌నాయక్, తేళ్ల శ్రీను, షేక్ ఖాదర్ బాబా, సంతోష్, ఆవుల వెంకన్న, నీలేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.