లింగాలఘనపురం, నవంబర్ 2 : స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణులు గురువారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని వినాయక, శివాలయ, ఆంజనేయస్వామి, పోచమ్మ తదితర ఆలయాలకు బీఆర్ఎస్ శ్రేణు లు ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మచ్చలేని కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి గవ్వల మల్లేశం, మండల మాజీ అధ్యక్షుడు ఏదునూరి వీరన్న, గ్రామ అధ్యక్షుడు కేమిడి యాదగిరి, విండో అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు కేమిడి కవితావెంకటేశ్, కారంపురి చంద్రయ్య, ఎడ్ల రాజు, బోయిని జంపయ్య, బింగి స్వా మి, వేముల శ్రీనివాస్, బెజ్జం చంద్రయ్య, ఆకుల రవి, దేవయ్య, వంగ జనార్దన్, రవి, సత్యనారాయణ, బో యిని శ్రీనివాస్, ఎండీ జానీమియా, చొక్కమ్మ, శ్రీహరి, వెంకటేశ్, నర్సయ్య, నర్సయ్య పాల్గొన్నారు.
చిల్పూరు : స్టేషన్ఘనపూర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మార్బుల్, టైల్స్ వర్కింగ్ యూనియన్ సంఘం నాయకులు తెలిపారు. గురువారం హనుమకొండలో కడియం శ్రీహరిని ఎంపీటీసీ అంజయ్ రెడ్డి, మాజీ సర్పంచ్ భూక్యా సుధాకర్, ఆధ్వర్యంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం మార్బుల్, టైల్స్ వర్కింగ్ యూనియన్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాక్షాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కడియం శ్రీహరికి మద్దతు తెలిపి విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్బుల్, టైల్స్ వర్కింగ్ యూనియన్ అధ్యక్షుడు గైయి రాజు, ఉపాధ్యక్షుడు రమణాకర్, రాజు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
జఫర్‌గఢ్ : బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరికే తాము మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటికాయల చిరంజీవి అన్నారు. జఫర్‌గఢ్‌లో గురువారం ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గాదెపాక నాగరాజుతో కలిసి ముఖ్య నాయకుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగరాజు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో బీఆర్ఎస్కు మద్దతుగా నిలవాలని కోరారు. జఫర్గడ్ మండల కేంద్రంలో ఈ నెల 4న కడియం శ్రీహరికి మద్దతుగా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మండలంలోని దళిత నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, శ్రేణులు అందరూ జఫర్‌గఢ్‌లో నిర్వహించనున్న సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరై కడియం శ్రీహరికి మద్దతు తెలుపుదామని చిరంజీవి, నాగరాజు కోరారు. రాష్ట్ర ప్రచార కార్యదర్శి తాటికాయల సంపత్, జఫర్‌గఢ్ మాజీ ఎంపీటీసీ తాటికాయల ఎల్లయ్య, బండ్ల సుదర్శనం, నర్సింగం, ఏలియా, బక్కయ్య, ఎల్లయ్య, బొజ్జు సోమయ్య, నర్సింగం, యాదయ్య, బండ్ల సోమయ్య, మారపల్లి కొమురయ్య పాల్గొన్నారు.