పాలకుర్తి, నవంబర్ 29: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పెదింటి ఆడబిడ్డలకు వరమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన 87 మంది లబ్ధిదారులకు రూ.87 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
యశస్వినీరెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు తనను నేరుగా కలవచ్చానన్నారు. లబ్ధిదారుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురుకుల బాలికల పాఠశాలను ఆమె తనిఖీ అన్నం, కూరలను రుచి చూశారు. విద్యార్థులకు పౌష్టికాహాన్ని అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్యా మంజుల భాస్కర్, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఆవుల రాములు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సరస్వతి, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, గిరగాని కుమారస్వామి, నల్ల శ్రీరాములు, సురేశ్‌నాయక్, ఎర్రబెల్లి రా ఘవరావు, జలగం కుమార్, యాకాంతారావు, సలేం ద్ర శ్రీనివాస్, పన్నీరు వెంకన్న పాల్గొన్నారు.