భవిష్యత్‌ను తీర్చిదిద్దేది
తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దే విధంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
- బీఆర్ఎస్ మ్యానిఫెస్టోనే.. ప్రజలే నా బలం.. వారే మా ఆస్తి
- ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశమిస్తే ఎంతో అభివృద్ధి చేశా
- శివనగర్ రాజకీయ జన్మనిచ్చింది
- మీ బిడ్డగా ఆశీర్వదించండి..
- ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, నవంబర్ 20: తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దే విధంగా సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 34వ డివిజన్ శివనగర్‌లో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మలు, మంగళహారతులతో అడుగడుగునా స్వాగతం పలికారు. యువకులు ఆయనను గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ శివనగర్ తన చేయి పట్టుకొని నడిపించి రాజకీయాల్లో తీసుకొచ్చి ఈ స్థాయిలో నిలిపిందని గుర్తుచేసుకున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మరోసారి అవకాశం కల్పిస్తే తూర్పు రూపురేఖలు పూర్తిగా మారుస్తానన్నారు. ఇప్పటికే శివనగర్ను రోల్ మోడల్‌గా తీర్చిద్దానన్నారు. వాడవాడలా సీసీరోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు.
శివనగర్ వరద ముంపునకు గురికాకుండా శాశ్వత చర్యలు చేపట్టి సఫలమయ్యామన్నారు. డ్రైనేజ్ నిర్మాణంలో ఇండ్లు కూల్చే పరిస్థితి వస్తే.. దగ్గరుండి ఆ ఇండ్లు కోల్పోకుండా చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. అండర్ గ్రౌండ్ డక్ట్ నిర్మాణం చేసి ఈ ప్రాంతం ముంపునకు గురికాకుండా చేశానన్నారు. ఇంత గొప్పగా అభివృద్ధి చేసిన తనను మీ బిడ్డగా మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పగడాల సతీశ్, బీఆర్ఎస్ నాయకులు మేరుగు అశోక్, గడ్డం రవి, ఇన్చార్జి రాజేశ్, మంద మహేందర్, నామాని రాజ్‌కుమార్, కలకొండ అభినాష్, సాంబయ్య, మంద అక్షిత్, పోలెపాక రాజు, గోగుల ఇందిర, అరుణ, మోహినీఘాటె, సోమలక్ష్మి, ఉమ, విజయ, స్వప్న, రాధిక, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే, శివనగర్‌లోని రుద్రమాంబనగర్లో జారతి దేవి, మంద మహేందర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ హాజరు కాగా, రుద్రమాంబనగర్ ప్రజలు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
అందరికీ అండగా ఉంటా
పోచమ్మమైదాన్: వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, ఆపదలో ఉన్న వారిని అన్ని విధాలా ఆదుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఓరుగల్లు పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్లో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పెయింటర్స్ అసోసియేషన్ నన్నపునేనికి పూర్తి మద్దతు తెలిపి ఏకగ్రీవ తీర్మానం చేసింది. అనంతరం ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ పెయింటర్స్ అసోసియేషన్ వారికి అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వంచనగిరి, పర్వతగిరి వాళ్లతో మనకేం లాభం ఉండదని, తాను పక్కా లోకల్ అని, మీ ఆపతి, సంపతిలో అండగా ఉంటూ ఆదుకుంటానని ఎమ్మెల్యే నరేందర్ హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, ఎన్నికల ఇన్చార్జి మావురపు విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు బీఆర్ఎస్ అండ
బీఆర్ఎస్ సర్కారు అన్ని వర్గాలకూ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాల మైదానంలో నన్నపునేని సోమవారం వాకర్స్‌తో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదానంలో వాకర్స్ కోసం తగిన వసతులు ఉన్నాయని, ఇంకా ఏమైన సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేశ్‌కుమార్ జోషి, కావటి కవితా రాజుయాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వీవర్స్‌కాలనీలో ఏకగ్రీవ తీర్మానాలు..
వరంగల్ 12వ డివిజన్ వీవర్స్ కాలనీతోపాటు అనుంబంధ కాలనీలు సమావేశమై ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు మద్దతు పలికాయి. ఈ ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎనిమిది కాలనీవాసులు తనకు మద్దతు తెలుపుతూ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇదే చైతన్యంతో బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుకు కృషి చేయాలని, ఎన్నికల తర్వాత ఈ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కావటి కవితా రాజు పాల్గొన్నారు. అనంతరం నన్నపునేని దేశాయిపేటలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన బాధితులను పరామర్శించారు. బాధితులు సిగ స్వరూప, సిగ కరుణాకర్, జన్ను చంద్రబాబుతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలు, మృతి చెందిన జాన్ భార్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కావటి కవిత, పార్టీ డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, రాంకీ యాదవ్, జన్ను శరత్ పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తా
గిర్మాజీపేట: వచ్చే ఎన్నికల్లో తనకు మరోమారు అవకాశం కల్పిస్తే తూర్పు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 42వ డివిజన్‌కు చెందిన కురుమ సంఘం నాయకులు మండల సీతారాములు, మండల రాములు, యాదవ సంఘం నాయకుడు సాంబయ్య సుమారు 40 మంది సభ్యులతో కలిసి శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండు చందనా పూర్ణచందర్, ఎన్నికల ఇన్చార్జి కొంతం తారా మోహన్, డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గుడిసెవాసులు అండగా నిలవాలి
కరీమాబాద్: గుడిసెవాసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలవాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జక్కలొద్దిలోని గుడిసెకాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ సర్కారుదేనన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్కు ఎదురులేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు.
పటేల్, పట్వారీ వ్యవస్థ వస్తది
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

