హనుమకొండ, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర లోగోను మార్చడం సరైంది కాదని బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకుడు నయీమొద్దీన్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో లోగోను మార్చొద్దని రాసిన పోస్ట్ కార్డులను సీఎం రేవంత్‌రెడ్డికి పంపించారు. కార్యక్రమంలో ఇస్మాయిల్, తస్లీమ్ యాకూబ్, ఆరిఫ్, రఘు, ఇంతియాజ్, గౌస్ ఖాన్, ఆసిలిన్ పాల్గొన్నారు.