రాయపర్తి, మార్చి 13 : ఆలయాల నిర్మాణంతో సమాజంలో శాం తి చేకూరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం ఆయన మండలంలోని కొండూరులో సిద్ధేశ్వర, ధ్వజస్తంభ, పెద్దమ్మతల్లి, బంగారు మైసమ్మ, జంట నాగుల పునఃప్రతిష్టాపన, కుంభాభిషేక, రజతోత్సవ వేడుకలకు మంత్రి హాజరయ్యారు. సర్పంచ్ కర్ర సరితా రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర, ఉత్సవ కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, వేద పండితులు పరాశరం కిరణ్కుమారాచార్యుల సారథ్యంలో ఎర్రబెల్లికి స్వాగతం పలికారు. సిద్ధేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిలను నిర్మిస్తున్నారని చెప్పారు. గ్రామ శివారులోని పెద్దమ్మతల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి గ్రామానికి చెందిన పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయాల ఉత్సవాలకు విగ్రహాల కొనుగోలుకు విరాళాలు అందజేసి దాతలను మంత్రి సన్మానించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు వీరమనేని సత్యనారాయణరావు, కర్మిళ్ల సోమేశ్వర్రావు, పులి సోమయ్యగౌడ్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమి తి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పూస మధు, ఆవుల కేశవరెడ్డి, జక్కుల వెంకట్‌రెడ్డి, పోల్నేని శ్యాంరావు, వల్లెపు వెంకన్న, కొమ్ము రాజు, పంతంగి నర్సయ్య, నేరెల్లి రాములు పాల్గొన్నారు.