నెక్కొండ మే 5 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రత్నమాల సూచించారు. నెక్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సూరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను ఎంఈఓ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని శిక్షణ శిబిరాలను ప్రారంభించిందన్నారు.
ఈ నెల19వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యార్థులకు డ్రాయింగ్, డాన్స్, క్రాఫ్ట్ ,కరాటే గేమ్స్, స్పోర్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అంశాలలో విద్యార్థులకు శిక్షణను ఇచ్చేలా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ అవకాశాన్ని మండలంలోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలనీ ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నెక్కొండ, సూరిపల్లి హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రంగారావు, పరమేశ్వర్, ఉపాధ్యాయులు ఉప్పలయ్య, ఐలయ్య, కుమారస్వామి, కిషన్ రావు, సుజాత, తదితరులు పాల్గొన్నారు.