రాయపర్తి/పాలకుర్తి, ఆగస్టు 6 : మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగెస్ ప్రభుత్వం ప్రజల గోస పంచుకుంటున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాయపర్తి మండ లంలోని మైలారం గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారంలోకి రాగానే రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి మారిందన్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా సమృద్ధిగా సాగు జలాలు, సరిపడా కరెంట్, సకా లంలో విత్తనాలు, ఎరువులు అందించలేని దుస్థితిలో సర్కారు ఉందని మండిపడ్డారు.
గత 18 నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడం మూలంగా గ్రామాలు సమస్యలకు నిలయాలుగా మారాయని, కేంద్రం నిధులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూటకో మాట చెబుతూ.. గంటకో నిర్ణయాన్ని వెల్లడిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారుకు దమ్ముంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. ప్రజలను మోసగించిన పాలకులంతా గతంలో ఏమయ్యారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు. ప్రజా విశ్వసాన్ని ఆ పార్టీలు కోల్పోవడం కారణంగానే నేతలంతా గులాబీ గూటికి చేరుతున్నారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖతమని, ఆరు మండలాల్లో బీఆర్ఎస్దే విజయమని అన్నారు. అమలు కానీ హామీలతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశాడన్నారు. పాలకుర్తి నియోజక వర్గంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఆగిపోయాయని, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ల పనులు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. దేవాదుల కాల్వల ద్వారా చేరువులను నింపాలని డిమాండ్ చేశారు. పర్యాటక పనులు ఆగిపోయాయని, హరిత హోటల్ ఏమైందని ప్రశ్నించారు. సోమనాథుడి స్మృతివనంపై దృష్టి సారించాలన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఎర్రబెల్లి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక
పాలకుర్తి మండలంలోని వల్మిడి మాజీ ఎంపీటీసీ తాళ్ల సోమనారాయణ, మంచుప్పుల మాజీ సర్పంచ్ బొమ్మగాని కొంరయ్యగౌడ్, కోతులబాధ గ్రామానికి చెందిన తొర్రూరు (జే) పీఏసీఎస్ డైరెక్టర్ దామెర ఆంజయ్య, మాజీ రైతు కోఆర్డినేటర్ ఏనుగు ఆంజిరెడ్డి, తొర్రూరు ఆటోయూనియన్ అధ్యక్షుడు గిరగాని రవి, ముత్తారం గ్రామానికి చెందిన పూజారి సమ్మయ్య, గుడికుంట తండాకు చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. అదేవిధంగా రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, బీజేపీ మండల నాయకుడు నాగపురి రాంబాబు, దీకొండ దేవేందర్, సుధాకర్, దామెరశెట్టి ఆగయ్య, బుర్ర రవి, కత్తి వెంకన్న, బండారి రాజు, రామగిరి భాస్కర్, అడ్లూరి రాంబాబు, చీదురు రాజు, బండపల్లి సిద్ధూలతోపాటు సుమారు 20 మంది గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరందరికి ఎర్రబెల్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వోనించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, చేరికల కమిటీ రాయపర్తి మండల కన్వీనర్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మునావత్ నర్సింహానాయక్, పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్లానాగిరెడ్డి, మాజీ జడ్పీ టీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్‌రెడ్డి, వైస్ చైర్మన్ కారుపోతుల వేణు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ ముస్కు రాంబాబు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.