జనగామ రూరల్ : జనగామ నియోజకవర్గం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు లింగాల నర్సిరెడ్డికి( Lingala Narsireddy) ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఎల్వోసీ ( LOC ) అందజేశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకోసం ఆర్థిక స్థోమత లేకపోవడంతో జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ స్పందించారు. విషయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ , రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ( Minister Ponnam ) దృష్టికి తీసుకురాగా స్పందించి రూ. 2.50 లక్షల ఎల్వోసి మంజూరు చేయించారు. ఎల్వోసీ మంజూరు పత్రాన్ని వారికుటుంబసభ్యులకు ఆసుపత్రిలో నాగపురి కిరణ్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగాబాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ (CMRF) ని మంజూరు చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనగామ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గనిపాక మహేందర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శామీర్పేట నర్సింగరావు, కె.కరుణాకర్ రెడ్డి, కొన్నే మహేందర్ రెడ్డి, కిసాన్ సెల్ రాజిరెడ్డి, లింగాల రాజేందర్ రెడ్డి, ఉదయ్ పాల్గొన్నారు.