హనుమకొండ చౌరస్తా, జూలై 8 : ప్రపంచంలోని ప్రముఖ జువెల్లరీ రిటైల్ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం హనుమకొండ నక్కలగుట్టలో పునఃప్రారంభమైంది. దీన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైల్ హెడ్-రెప్ట్ ఆఫ్ ఇండియా సిరాజ్ పీకే, వరంగల్ షోరూం హెడ్ అజీష్, సోమాజిగూడ షోరూం హెడ్ షరీజ్, కూకట్పల్లి హెడ్ షానిబ్ సమక్షంలో లాంఛనంగా శనివారం ప్రారంభించారు. ఎక్కువ స్థలం, విస్తృతమైన ఆభరణాల సేకరణలు, అంతర్జాతీయస్థాయికి దీటైన అనుభవం మేళవించి వరంగల్ షోరూం పునర్నిర్మించినట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. వివిధ రకాల వేడుకలకు బడ్జెట్‌కు సరిపోయే బంగారం, వజ్రాలు, విలువైన రత్నాభరణాలు మొదలుకుని పోల్కీ ఆభరణాలు, పురాతన కళాకృతులతో పాటు మరెన్నో ఆభరణాలు ఈ షోరూంలో లభిస్తాయని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభూతి, అద్భుతమైన ఆభరణాల సేకరణలను ఈ షోరూం అందిస్తుందన్నారు.
విలువైన కస్టమర్ల విభిన్న ప్రాధాన్యతలను తీర్చే నాణ్యమైన అత్యుత్తమ ఆభరణాలు మాత్రమే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 4.9 శాతం నుంచి ప్రారంభమయ్యే అత్యల్ప తరుగు చార్జీలతో పాటు మలబార్ ఫెయిర్ ప్రైజ్ వాగ్ధానం ప్రయోజనాలు, అత్యుత్తమైన పారదర్శకత ధరతో అద్భుతమైన ఆభరణాలను అందిస్తున్నట్లు వివరించారు. జీరో శాతం డిడక్షన్ గోల్డ్ ఎక్సేంజ్ వాగ్దానంతో, హాల్‌మార్క్ ఉన్నా లేకున్నా ఏ ఇతర షారూంలో కొన్నవైనా 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను మలబార్ హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ చేసిన ఆభరణాలతో మార్చుకోవచ్చని, ఇందులో 100 శాతం మార్పిడి విలువను పొందవచ్చని తెలిపారు. అలాగే, సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ షోరూం ద్వారా ఆర్జించిన లాభాల్లో 5 శాతం మొత్తాన్ని ఇదే ప్రాంతంలో వివిధ ధార్మిక, దాతృత్వ కార్యకలాపాల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ 11 దేశాల్లో 320పైగా షోరూంలతో గ్లోబల్ జ్యువెలరీ రిటైలర్‌గా ప్రఖ్యాతిగాంచిందన్నారు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కేరళ రాష్ట్రంలోని కాలికట్ పట్టణంలో 1993లో స్థాపించినట్లు చెప్పారు. అత్యంత కచ్చితత్వం, నాణ్యతతో రూపొందించిన ఆభరణాలను అందిస్తూ విశ్వసనీయ ఆభరణాల వ్యాపార సంస్థగా ఎదిగిందన్నారు.