హనుమకొండ, ఫిబ్రవరి 11: ఈ నెల 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకొని 16 నుంచి 26వ తేదీ వరకు కేసీఆర్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్భాసర్ తెలిపారు. కేసీఆర్ క్రికెట్ పోటీల నిర్వహణపై శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మూడేళ్ల నుంచి కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సారథ్యంలో ఆర్ట్స్ కళాశాలలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా సీఎం కేసీఆర్ ట్రోఫీ నాలుగో సీజన్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీలో అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు, ప్రముఖులు పాల్గొంటారని విజయ్‌భాస్కర్ వివరించారు.
యువత, విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకే కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ ట్రోఫి ఆర్గనైజర్స్గ్గా బీఆర్ఎస్వీ నాయకులు, కాకతీయ క్రికెట్ అకాడమీ వారు వ్యవహరిస్తారన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ నుంచి రెండు టీంల చొప్పున మొత్తం 52 టీంలు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. టెన్నిస్ బాల్‌తో నిర్వహిస్తున్న ఈపోటీల్లో నాకౌట్ విధానంలో ప్రతి రోజూ 9 మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. విన్నర్స్ టీంకు రూ.75 వేలు, రన్నరప్ టీంకు రూ.40 వేలతో పాటు మ్యాన్ఆఫ్ద సీరీస్‌కు సైతం పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు. కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ నాలుగో సీజన్‌కు సంబందించి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజుగా ప్రతి టీంకు రూ.3వేలు చెల్లించి నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 15వ తేదీ రిజిస్ట్రేషన్‌కు చివరి గడవు అని తెలిపారు. క్రికెట్ టీంలు నమోదు చేసుకోవడానికి అస్లాం 7893944118, షాకిర్ 9573287096, వీరు 9963603676 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో కాకతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ ఫారూఖ్, ఉదయ్, షాకిర్, అస్లాం, బిర్ఎస్వీ నాయకులు వీరేందర్, ప్రశాం