బచ్చన్నపేట డిసెంబర్ 3 : గ్రామ ప్రజలకు సేవ చేయాలన్నదే నా జీవిత లక్ష్యం అని, అందుకే తన 24 ఏళ్ల ఉద్యోగానికి రాజీనామా చేసి బచ్చన్నపేట సర్పంచ్‌గా నామినేషన్ వేశానని అంగన్వాడీ టీచర్ కర్రె కౌసల్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగామ జిల్లా బచ్చన్నపేటలో మొదటి అంఅంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా జాయిన్ 24 ఏళ్లు పూర్తి అయింది అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాం అన్నారు. ఎంతోమంది ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ప్రజా సమస్యల పట్ల పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా కలెక్టర్, అంగన్వాడీ సూపర్వైజర్కు అందించామన్నారు. ఎంఏ సోసిషియాలజీ చదివిన తాను ప్రజా సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వచ్చానని తెలిపారు. మహిళలతో కలిసి, వారి సలహాలను తీసుకుంటూ ముందుకు నడుస్తానని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీరు, రోడ్లు, వీధిదీపాలు వంటి మౌలిక వసతులు కల్పనకు అంధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తానని వివరించారు. ఉద్యోగాన్ని సైతం వదిలి సర్పంచ్ బరిలో నిలిచాలని, ప్రజలు ఆశీర్వదించి తన ఆదరించాలని కౌసల్య కోరారు.