మహదేవపూర్,(కాళేశ్వరం)/ భూపాలపల్లి రూరల్, మే 23: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుషరాల్లో త్రి లింగ క్షేత్రంలో భక్తజనం కోలాహ లం నెలకొంది.శుక్రవారం 9వ రోజు పెద్ద ఎత్తున భక్తు లు కాళేశ్వరానికి చేరుకుని త్రివేణి సంగమంలో పవి త్ర పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తిశ్రద్ధలతో పూజించి నదీమ తల్లికి చీరె, సారె, ఒడి సమర్పించారు. నదీ తీరం వద్ద సైకత లింగాలకు, వీఐపీ ఘాట్‌లో ఏర్పాటు చేసిన సరస్వతీ మాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి సెల్ఫీలు దిగారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. సుమారు 2లక్షలకు పైగా మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు మరిన్ని ఏర్పాట్ల చేసేందుకు చర్యలు చేపట్టారు. హంపీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య స్వామి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సరస్వతీ నవరత్న మాలా హారతి శోభాయమానంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున వస్తుండడంతో కాళేశ్వర ముక్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో తయారుచేసిన 30 వేల లడ్డూలు సరిపోకపోవడంతో అధికారులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి అదనంగా మరో ఐదు వేల లడ్డూలను తెప్పించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణను పకడ్బందీగా చేపడుతున్నారు. సరస్వతీ పుషర, గోదావరి ఘాట్, తాతాలిక బస్టాండ్, రహదారుల వెంట నిత్యం చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను సేకరించి సం చుల్లో నింపి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. భూ పాలపల్లి డీపీవో వీరభద్రయ్య, మంచిర్యాల, పెద్దపల్లి డీపీవోల నేతృత్వం లో ఇద్ద రు డీఎల్పీవోలు, 50 మంది ఎంపీడీవోలు, ఎంపీవోలు, 156 మంది పంచాయతీ కార్యదర్శులు, 496 మంది ప్రైవేట్ పారిశుధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. 60మంది మల్టీపర్పస్ వరర్లను రిజర్వ్‌లో ఉంచారు. అధికారులు నిత్యం పారిశుధ్య నిర్వహణ చేయిస్తున్నారు. కాగా, నస్పూర్ కాలనీకి చెందిన కానిగంటి మల్లేశ్ పుష్కరాలకు వచ్చి బైక్‌పై వెళ్తుండగా పోలీసు వాహనం ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన సేవల కోసం మహదేవపూర్ ఆసుపత్రికి తరలించారు. దైవ దర్శనానికి వచ్చే దివ్యాంగుల కోసం దక్షిణ ద్వారం వైపు మెట్ల మార్గం నిర్మిస్తున్నారు.
గ్రామపంచాయతీ టోల్ వసూళ్ల వల్ల వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, వాటిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ శుక్రవారం ఉద యం ప్రకటించారు. నిర్వాహకులు కొద్ది సేపు వసూళ్లను నిలిపివేసి, మళ్లీ యధాతథంగా టోల్ వసూల్ చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండ గా ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు వన్ వే ఏర్పాటు చేయడంతో మహదేవపూర్ నుంచి అన్నా రం మీదుగా కాళేశ్వరానికి వెళ్లే వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. అన్నారం-పలుగుల రోడ్డులో ట్రాఫిక్ జా మ్ను కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే క్లియర్ చేశారు. క్యూలో భక్తులతో కలెక్టర్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నవరత్న మాల హారతి నిర్వహిస్తున్న కాశీ పూజారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి, దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని వేద పండితులను అభినందించారు.