Chess Selection Competitions | హనుమకొండ చౌరస్తా, జూన్ 28: వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో జులై 5, 6న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ఓపెన్ టు అల్ చదరంగ ఎంపిక పోటీలు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు 4న సాయంత్రం వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇందులో గెలుపొందిన నలుగురిని జూలై 11, 12, 13 తేదీల్లో ఖమ్మంలో జరగబోయే రాష్ర్టస్థాయి చదరంగ పోటీలో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు తమ వెంట చెస్ బోర్డు తెచ్చుకోవాల్సిందిగా సూచించారు. మరిన్ని వివరాలకు నిర్వహణ కార్యదర్శి కన్నాను 90595 22986 నెంబర్లో సంప్రదించాలని కోరారు.