మహదేవపూర్ : మండలంలోని బెగ్లూర్ ప్రభుత్వ పాఠశాలకు గ్రామస్తులు ఆర్థిక చేయూతనందించారు.
గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు, వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శుక్రవారం పాఠశాల మరమ్మత్తుల కొరకు సాయం చేశారు.
తమవంతు సాయంగా గ్రామస్తులు రూ.13,600 పాఠశాల హెచ్ఎం టీ.రామ్మూర్తికి అందజేశారు. పాఠశాల అభివృద్ధికి పెద్ద మనసుతో సహకరించిన గ్రామస్తులను హెచ్ఎం, ఉపాధ్యాయుల బృందం అభినందించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.