Bhupalpally : ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకండి.. డిజిటల్ సంతకంతో పంపించండి..

భూపాలపల్లి రూరల్ : ఫైళ్ల నిర్వహణ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి పెండింగ్‌లో లేకుండా చూడాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లు, ఇతర శాఖల అధికారుల ఛాంబర్లను తనిఖీ చేసి ఫైళ్లను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్లోని వివిధ సెక్షన్లను పరిశీలించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయలన్నారు. సింగరేణి, జెన్కో, ఇరిగేషన్, నేషనల్ హైవే తదితర ల్యాండ్ అక్విజిషన్ వివరాల ఫైళ్లను ప్రత్యేకంగా పొందుపరుచాలని, పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ఫైల్స్ ఈ-ఆఫీస్ లో నిర్వహించేటప్పుడు డిజిటల్ సంతకంతో పంపించాలని అన్నారు.
అనంతరం ల్యాండ్ సర్వే, ప్రణాళిక, సమాచార పౌర సంబధాలు, బీసీ అభివృద్ధి, ఎస్సీ అభివృద్ధి, గ్రౌండ్ వాటర్, పంచాయతీ, పౌర సరఫరాలు, మహిళా శక్తి కేంద్రం, తదితర శాఖల కార్యాలయాలను సందర్శించి ఫైళ్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మహేష్‌బాబు, ఏడీ సర్వేల్యాండ్ సుదర్శన్, సీపీవో సామ్యూల్, డీపీఆర్వో రవికుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

