రైతును రాజు చేస్తున్న సీఎం కేసీఆర్
ఓర్వలేకే తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
లింగాలఘనురం, డిసెంబర్ 20 : తెలంగాణలో పండిన వడ్లను కొనకుండా కేంద్రం కక్షసాధింపునకు పాల్పడుతున్నదని, ఇప్పటికైనా ప్రధాని స్పందించకుంటే పోరా టం తప్పదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించి చావుడప్పు కొట్టా రు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని తెలిపారు. రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్ వ్యవసాయానికి నిరంతర విద్యుత్ ఇస్తూ పంటల దిగుబడులు పెంచుతుంటే కేంద్రం ఓర్వలేకపోతున్నదన్నారు. బీడు భూములకు సీఎం కేసీఆర్ గోదావరి జలాలను తీసుకురావడంతో వరి సాగు పెరిగిందన్నారు. మరోవైపు దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళితబంధు తీసుకొస్తుంటే విపక్షాలు తప్పుడు ప్ర చారం చేస్తున్నాయని రాజయ్య మండిపడ్డారు. దశల వారీగా అర్హులైన ప్రతి దళితుడికి ఈ పథకం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు గుడి వంశీధర్ర్రెడ్డి, మారపాక రవి, బొల్లం అజయ్, మాజీ జడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, ఇన్చార్జిలు బొల్లంపెల్లి నాగేందర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, సొసైటీ చైర్మన్ మల్గ శ్రీశైలం. సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు దూసరి గణపతి, నాయకులు సుధీర్‌రెడ్డి, గండి యాదగిరి, కేమిడి వెంకటేశ్, బుషిగంపల అంజనేయులు, కొత్తకొండ గంగాధర్, నర్సింగ్ రామకృష్ణ, ఏదునూరి వీరన్న, కారంపురి శ్రీనివాస్, కత్తుల శ్రీపాల్‌రెడ్డి, కాటం కుమార్, అంతగల్ల రాంచందర్, గట్టగల్ల శ్రీహరి, గవ్వల మల్లేశం, రాజేశ్వర్, లక్కీ, కేమిడి యాదగిరి , మోటె వీరస్వామి, యాకన్న తదితరులు పాల్గొన్నారు.
వడ్లు కొనేదాక ఊరుకోం..
-గంధమల్ల రాములమ్మ , మహిళా రైతు
‘రైతులు పండించిన వడ్లు కొనాలె.. లేకుంటే ఊరు కోం.. కేంద్రం పట్టించుకో కుంటే పోరాటం చేస్తాం..’ అని లింగాలఘనపురానికి చెందిన మహిళా రైతు గంధ మల్ల రాములమ్మ అన్నారు. సీఎం కేసీఆర్ సార్ పోరాటా నికి అందరూ అండగా ఉం డాలని ఆమె కోరారు.