రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి
భిక్షాటన చేస్తున్న ఏడుగురి పట్టివేత.. కుటుంబాలకు కౌన్సెలింగ్
పిల్లలను పాఠశాలలో చేర్పించాలని అధికారులకు ఆదేశాలు
కృష్ణకాలనీ, జనవరి 10 : బాలలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి హెచ్చరించారు. జిల్లా బాలల పరిరక్షణ విభా గం, పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్-8లో భాగంగా అనాథపిల్లలకు ఉచిత విద్య, వసతి ఇవ్వాలని వారి కుటుంబాలకు చే యూనందించాలనే ఉద్దేశంతో సోమవారం శోభారాణి జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భిక్షాట న చేస్తున్న ఏడుగురు బాలలను పట్టుకుని సీడబ్ల్యూసీ ముందు హాజరుపర్చారు. ఈ సందర్భం గా బాధి త బాలల ఇళ్ల వద్దకు వెళ్లి వారి స్థితిగతు లు, భిక్షాటన చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పిల్లల తో భిక్షాటన చేయించి వారి భవిష్యత్‌ను నా శనం చేయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. భి క్షాటన చేయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏడుగురు పిల్లలను వెంటనే పాఠశాల ల్లో చేర్పించి, బాలల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడానికి వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చే యాలన్నారు. కొంతమంది తల్లిదండ్రులుకు టుంబ నియంత్రణ పాటించకుండా పిల్లలను కం టూ పోషణ భారాన్ని మోయలేక వారితో భిక్షాటన చేపిస్తున్నారని, అలాంటి కుటుంబాలను గుర్తించి వెంటనే కు.ని ఆపరేషన్లు చేయించాలన్నారు. బాధి త కుటుంబాలకు సరైన నివాసాలు లేకపోవడం తో ఇబ్బంది పడుతున్నారని, నివాసాలు లేని 16 సం చార జాతి కుటుంబాలకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రాకు వి జ్ఞప్తి చేశారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. అనంతరం జెన్కో గెస్ట్‌హౌస్‌లో జిల్లా సంక్షేమ అధికారి కే శామ్యూల్ అధ్యక్షతన ఏర్పా టు చేసిన సమీక్ష పాల్గొన్నారు. ఆపరేషన్ స్మైల్‌లో ఏఏ విభాగాలు ఏవిధంగా పని చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, బాలల హక్కులకు భం గం కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్యక్రమంలో బాలరక్షా భవన్ కో ఆర్డినేటర్ శిరీష, సీడీపీవో అవంతి, భూపాలపల్లి తహసీల్దార్ ఎండీ ఇక్బాల్, ఆపరేషన్ స్మైల్ జిల్లా ఇన్చార్జి సీఐ జీ మోహన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి బీ హరికృష్ణ, ఆపరేషన్ స్మైల్ భూపాలపల్లి స బ్ డివిజన్ ఇన్చార్జి ఎస్సై ఊర్మిళ, బాలల సంరక్ష ణ అధికారి వెంకటస్వామి, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ సునీల్, ఆర్ఐ సునీల్, అంగన్వాడీ టీచర్ శోభారాణి, డీసీపీయూ, చైల్డ్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.