సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటాలి
వంద శాతం పన్నులు వసూలు చేయాలి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో జోరుగా సాగుతున్న పల్లె ప్రగతి పనులు
జయశంకర్ భూపాలపల్లి, జూలై 6 (నమస్తే తెలంగాణ) : పట్టణాలను అభివృద్ధి చేసుకునేందుకు పట్టణ ప్రగతి కార్యక్రమం గొప్ప అవకాశమని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులను అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్‌బాషాతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రత్యేకాధికారులు అన్ని వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించి, పట్టణ ప్రగతి నిధులతో అభివృద్ధి చేసుకోవాలన్నారు. పట్టణంలోని గృహాలు, వాణిజ్య సముదాయాలన్నిటిని గుర్తించి, వాటి నుంచి 100 శాతం పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ, సింగరేణి కార్యాలయా ల నుంచి పూర్తి స్థాయిలో పన్నులు వసూలు చేయాలని సూచించారు. పట్టణంలోని వార్డుల్లో రహదారులకు ఇబ్బందికరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి పక్కకు తరలించాలన్నారు. లూజు తీగలను సరిచేయాలని అధికారులను, కౌన్సిలర్లను ఆదేశించారు. ఇంటింటికీ పంపిణీ చేస్తున్న ఆరు మొక్కలను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పెంచి వృక్షాలుగా మార్చాలని ప్రజలకు సూచించారు.
డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్…
అంబేద్కర్ స్టేడియం నుంచి ఓపెన్ కాస్ట్ బంకర్ వరకు సింగరేణి సహకారంతో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, రోడ్డుకు ఇరువైపులా మురుగు కాలువలు ఏర్పాటు చేయనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు తెలిపారు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో బ్లాస్టింగ్, బంకర్ వల్ల వెలువడే దుర్వాసన, బొగ్గు, దుమ్ము తో 16,18వ వార్డుల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను తొలగించేలా సహకరించాలని కౌ న్సిలర్ దాట్ల శ్రీనివాస్ కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమం లో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వార్డు స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి అవినాశ్, కౌన్సిలర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న పనులు
టేకుమట్ల : మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శులు, గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. మొక్కలు నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. మండలంలోని రాఘవాపూర్‌లో చేపట్టిన పారిశుధ్య పనులను మండ ల ప్రత్యేక అధికారి పురుషోత్తం పరిశీలించి, మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, సర్పంచ్ నందికొండ శోభారాణి, ఎంపీడీవో చండీరాణి, ఏపీవో మాధవి, ఎంపీవో రామ్‌ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పారిశుధ్య నిర్వహణలో పాలు పంచుకోవాలి
ములుగురూరల్ : గ్రామాల్లో పేరుకుపోయిన పారిశుధ్యాన్ని నిర్మూలించేందుకు పల్లె ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు శ్రమదానం చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీసుధీర్యాదవ్ అన్నారు. మండలంలోని ఇంచర్లలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలను ఎంపీ పీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి సెగ్రిగేషన్షెడ్కు తరలించాలన్నారు. కంపోస్టు ఎరువులను తయారు చేసి జీపీ లో ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని సూచించారు. ఆమె వెంట పీఏసీఎస్ చైర్మన్ రాములు, ఎంపీవో హన్మంతరావు, ఎంపీటీసీ పూజారి రమాదేవి, సర్పంచ్ మోరె రాజ య్య, కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు ఉన్నారు. మల్లంపల్లి, కాసిందేవిపేట, దేవగిరిపట్నం, శ్రీనగర్, బండారుపల్లి, రామచంద్రాపురం, పత్తిపల్లి, జంగాలపల్లి తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి చేపట్టారు.
జోరుగా ప్రగతి పనులు
వెంకటాపురం(నూగూరు) : మండల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రం చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచులు చిడెం యామిలి, పూజరి ఆదిలక్ష్మి, అట్టం సత్యవతి పాల్గొన్నారు.
పిచ్చి మొక్కల తొలగింపు
వెంకటాపూర్ : మండలంలోని పాలంపేటలో మంగళవారం సర్పంచ్ డోలి రజితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి మొక్కలు నాటారు. గ్రామంలో యువత, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సమ్మక్క, పంచాయతీ కార్యదర్శి నిరంజన్, కారోబార్ రవి, గ్రామస్తులు సురేందర్, రవి, నిజాముద్దీన్, రమేశ్ పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలకు పరిష్కారం
చిట్యాల : మండల కేంద్రంతో పాటు 25 గ్రామ పంచా యతీల్లో శానిటేషన్, విద్యుత్ సమస్యలు, పిచ్చిమొక్కల తొలగింపు వంటి పనులను ఆయా గ్రామాల సర్పంచులు చేపట్టారు. చల్లగరిగెలో సర్పంచ్ మంజుల పశువైద్య శాల ఆవరణ, ప్రధాన రహదారికి ఇరువైపులా చెత్త, పిచ్చి మొక్కలను జీపీ సిబ్బందితో తొలగింపజేశారు. తాగునీరు వాటర్ ట్యాంకుల సమస్యలను పరిష్కరించారు. జడల్‌పేటలో సర్పంచ్ కామిడి రత్నాకర్‌రెడ్డి అంగన్వాడీ సెంటర్ల గదులు, వాటి ఆవరణలో ఉన్న పరిసరాలను శుభ్రంచేసి అంగన్వాడీ టీచర్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ముమ్మరంగా పనులు
ఏటూరునాగారం : మండలంలో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం శ్రమదానం, పిచ్చి మొక్కల తొలగింపు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కల ను తొలగించారు. 12 వార్డులోని దళిత వాడల్లో కంకర వేసి రోడ్లు మరమ్మతులు చేపట్టారు. వై జంక్షన్ ప్రాంతంలో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, ఎంపీపీ అంతటి విజయ, ఎంపీడీవో ఫణిచం ద్ర, ఏంపీవో కుమారస్వామి, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, కార్యదర్శి రఫీయుద్దీన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల ఆవరణలో..
మహదేవపూర్ : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశా లల ఆవరణలో ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళ వారం శ్రమదానం నిర్వహించారు. పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీపతి బాపు, ఎంపీపీ బన్సోడ రాణీబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీడీవో కృష్ణవేణి, ఎంపీవో ప్రసాద్, కార్యదర్శి రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములు కావాలి
పలిమెల : హరితహారంలో ప్రజలందరూ భాగస్వాము లు కావాలని ప్రత్యేకాధికారి శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సర్పంచ్ జవ్వాజి పుష్పలత, పంచాయతీ కార్య దర్శి శ్రీధర్, పంకెనలో సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, దమ్మూరులో సర్పంచ్ మడె చుక్కమ్మ, పంచాయతీ కార్యదర్శి మదన్, ముకునూరులో సర్పంచ్ అలం సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి వినయ్‌కు మార్, లెంకలగడ్డలో సర్పంచ్ తోట రమాదేవి, పంచాయతీ కార్యదర్శి మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇనిస్టిట్యూట్ క్లీనింగ్, ప్లాంటేషన్‌లో భాగంగా పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణల్లో మొక్కలు నాటారు. కార్యక్ర మంలో తహసీల్దార్ బింగి సాయిబాబు, ఎంపీపీ కుర్సం బుచ్చక్క, ప్రత్యేకాధికారులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
గణపురం : మండలంలోని మైలారం గ్రామ పంచాయ తీలో సర్పంచ్ నల్లాని అరుణ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇస్తూ వాటి వివరాలు నమోదు చేసుకున్నా రు. మండలంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా పేరుకు పోయిన చెత్తను తొలగించాలని కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లెంకల అరుంధతి, ఎంపీవో రా మకృష్ట, ఏపీవో రాజయ్య, సర్పంచ్ల ఫోరం మండల అ ధ్యక్షుడు పొట్ల నగేశ్, నారగాని దేవేందర్‌గౌడ్, నడిపెల్లి మ ధుసూదన్రావు, చెరుకు కుమారస్వామి, మామిడి రవి, రామంచ భద్రయ్య, నల్లాని అరుణ, ఐలోని శశిరేఖ, ఒద్దు ల విజయ, కార్యదర్శులు చిరంజీవి, హరిచంద్రరెడ్డి, విజేం దర్, హేమంత్, వెంకటలక్ష్మి, స్రవంతి, నవీన్ పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
మల్హర్ : మండలంలోని మల్లారం, చిన్నతూండ్ల, నాచా రం గ్రామాల్లో సర్పంచులు గోనె పద్మ, పులిగంటి మమత, రామయ్య ఆధ్వర్యంలో ఇం టింటికీ మొక్కలు పంపిణీ చేశారు. తాడిచెర్ల ప్రభుత్వ పాఠశాల, ఎస్సీ కాలనీ, మన్నెపు గూడెం, బీసీ కాలనీలో పిచ్చి మొక్కలను తొలగించి పారిశు ధ్య పనులు చేపట్టినట్లు కార్యద ర్శి సత్యనారాయణ తెలిపా రు. మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస రావు, సింగిల్ విండో డైరెక్టర్ రాము, ఎంపీటీసీ ప్రకాశ్ రావు, చిన్నతూండ్ల ప్రత్యే క అధికారి దుర్గాప్రసాద్, తాడిచెర్ల ఉప సర్పంచ్ చంద్ర య్య, నాచారం ప్రత్యేక అధికారి మనీష, కార్యదర్శులు రాము, సత్యనారాయణ పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల వద్ద..
వాజేడు : మండలంలోని మొరుమురు గ్రామ పంచా యతీ పరిధిలోని ప్రగళ్లపల్లి పాఠశాల, బిజినేపల్లి అంగన్ వాడీ కేంద్రం వద్ద ఉన్న పిచ్చి మొక్కలను అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం శుభ్రం చేశారు. వాటర్ ట్యాం కుల్లో జీపీ సిబ్బంది బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. కార్యక్ర మంలో ప్రత్యేక అధికారి రవి, సర్పంచ్ పూసం నరేశ్, ఉప సర్పంచ్ గౌరరాపు కోటేశ్వరరావు, అంగన్వాడీ కార్యకర్త లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పారిశుధ్యంపై అవగాహన
కన్నాయిగూడెం : మండలంలోని ముప్పనపల్లి, గూర్రే వుల, లక్ష్మీపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలను మండల ప్రత్యేక అధికారి, డీపీవో వెంకయ్య, ఎంపీడీ వో బాబు పరిశీలించారు. పాఠశాలల ఆవరణలో పారిశు ధ్య కార్యక్రమాలు చేపట్టి చెత్తను తొలగించారు.ముప్పనపల్లి పల్లె ప్రకృతివనంలో కలుపు మొక్కలను తీయించారు. ఈజీఎస్ ఈసీ కుమార్, సర్పంచులు, అంగన్వాడీ, ఆశ కా ర్యకర్తలు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు
పనుల పరిశీలన
మహాముత్తారం : మండలంలోని మాదారం, జీలపల్లి, పర్లపల్లి, వజినేపల్లి, యత్నారం, యామన్‌పల్లి, నిమ్మగూ డెం గ్రామాల్లో మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సుధీర్‌కుమార్, ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు పర్యటించి, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పలు గ్రామాల్లో సర్పంచులు, గ్రామస్తులతో కలిసి అధికారులు శ్రమదానం చేశారు. అదనపు పీడీ అంజయ్య, ఎంపీవో ఉపెంద్రయ్య, సర్పంచులు అజీమాబేగం, సర్ణలత, రత్నం బక్కయ్య, కొడపర్తి మల్లిక, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
శానిటేషన్ పనులు ముమ్మరం
కాటారం : పల్లె ప్రగతిలో భాగంగా మంగళవారం ఇనిస్టిట్యూషనల్ శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఇబ్రహీంపల్లిలో ఎంపీడీవో శంకర్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి గడ్డి పెరగడంతో వెంటనే తొలగించాలని సర్పంచ్, కార్యదర్శిని ఆదేశించారు. చింతకాని గ్రామంలో జీపీ కార్యాలయ ఆవరణ, పాఠశాలలో మొక్కలు నాటారు. ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం చుట్టూ శానిటేషన్ చేస్తున్న తీరును ఎంపీడీవో పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఫిరోజ్ ఖాన్, ఉపసర్పంచ్ సంతోష్, కార్యదర్శి కరుణాకర్, కార్యదర్శి, వార్డు సభ్యులు ఉన్నారు.
మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
మొగుళ్లపల్లి : పల్లె ప్రగతిలో భాగంగా మంగళవారం మండలంలోని రంగాపురం, పాత ఇస్సిపేట, మొగుళ్లపల్లి గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాతా సంజీవరెడ్డి, ఎంపీడీవో రామయ్య, తహసీల్దార్ సమ్మయ్య, వైస్ ఎంపీపీ పోల్నేని రాజేశ్వర్‌రావు, సర్పంచులు బల్గూరి తిరుపతిరావు, మోటే ధర్మారావు పాల్గొన్నారు.