జనగామ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రఘునాథ్‌పల్లి పోలీసలు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వరంగల్ సీపీ మీడియాకు విరాలను వెల్లడించారు. నిందితులతో పాటు చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కోనుగొలు చేసిన మరో ఎనిమిది మంది వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు సర్సర్ శోభరాజ్, గోనే రాజునుంచి 7.50వేల రూపాయల విలువగల 12 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని సీపీ అభినందించారు.