జనగామ చౌరస్తా : జాతీయ ఆరోగ్య మిషన్లో ప్రసూతి నిర్వహణ కొరకు నాలుగు స్టాఫ్ నర్సు పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. జనరల్ నర్సింగ్ డిప్లామ/ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ కలిగి ఉండి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో తమ పేరు నమోదై ఉన్న అభ్యర్థులు అర్హులు అని కలెక్టర్ పేర్కొన్నారు. 34సంవత్సరాల లోపు వయసు ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు మైదాన ప్రాంతాల్లో 2 సంవత్సరాలు, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 1 సంవత్సరం లేబర్ రూమ్ అనుభవం కలిగి ఉండాలన్నారు.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు https//jangaon.telangana.gov.in లో నేటి నుంచి 15 అక్టోబర్ సాయంత్రం 5గంటలలోపు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. దరఖాస్తు నమూనాలను పై వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు కలెక్టర్ శివలింగయ్య సూచించారు.