Harish Rao | లక్ష్మణ్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త.. ఆయన భార్యకు ఉద్యోగం కల్పిస్తాం : హరీశ్ రావు
Harish Rao | ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్య కర్త లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు.
Harish Rao | ఇటీవల మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్య కర్త లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం పరామర్శిం చారు. బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి వెళ్లిన ఇద్దరు నాయ కులు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లక్ష్మణ్ గౌడ్ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. లక్ష్మణ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా హరీశ్ రావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి భరో సా ఇచ్చారు.
అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తమ్ముడు లక్ష్మణ్ గౌడ్ మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటన తమ అందరినీ తీవ్రంగా కలచివేసిందని హరీశ్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తాను, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చామన్నారు.
ముందుగానే కుటుంబాన్ని పరామర్శించేందుకు రావాలని భావించినప్పటికీ, పల్లా రాజేశ్వర్ రెడ్డికి కళ్ల కలక రావడంతో ఆలస్యమైందని, అయితే పల్లా మొదటి రోజే వచ్చి కుటుంబాన్ని పరామర్శించారని గుర్తుచేశారు. లక్ష్మణ్ గౌడ్ మృతికి దారితీసిన పరిస్థితులపై ఆయన భార్య స్వప్న, సోదరుడు వేణుతో మాట్లాడినట్లు హరీశ్ రావు తెలిపారు. కుటుంబ సభ్యులు వివరించిన అంశాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు.
మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని..
లక్ష్మణ్ గౌడ్ కొనుగోలు చేసిన జేసీబీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనింగ్ కేసులో సీజ్ చేసి నెలల తరబడి పోలీస్ స్టేషన్లో ఉంచారని కుటుంబ సభ్యులు తెలిపినట్లు హరీశ్ రావు వెల్లడించారు. భారీగా పెనాల్టీలు విధించడంతో జేసీబీని విడిపించుకోలేకపోయారని, దీంతో అప్పుల భారం పెరిగిపోయిందని వివరించారు. లక్ష్మణ్ గౌడ్‌కు సొంతంగా ఉన్న ఏడు ఎకరాలతోపాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వానాకాలం పంట సాగు చేసినట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు తపాస్‌పల్లి ద్వారా కొన్నే గ్రామ చెరువుకు నీరు రావాల్సి ఉన్నప్పటికీ ఈ ఏడాది నీరు రాలేదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పేర్కొన్నారు.
సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు బోరు కూడా విఫలం కావడంతో పంట ఎండిపోయిందని, పెట్టిన పెట్టుబడి నష్టపోయి మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు వివరించినట్లు హరీశ్ రావు చెప్పారు. దాదాపు 60 నుంచి 70 ఏళ్లుగా వారసత్వంగా అనుభవిస్తున్న భూమి తాత, తండ్రి, కుమారుల పేర్లపై ధరణి, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పటికీ, మరో వ్యక్తి ఆ భూమిపై హక్కు కోరుతూ దరఖాస్తు చేయడంతో కొత్త కలెక్టర్ ఆ భూమిని ప్రొహిబిషన్ జాబితాలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొన్నారు.
భూమి ప్రొహిబిషన్ జాబితాలో ఉండటంతో అప్పులు తీర్చేందుకు దానిని విక్రయించే అవకాశం కూడా లేకుండా పోయిందని, ఈ పరిణామం లక్ష్మణ్ గౌడ్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని కుటుంబ సభ్యులు వివరించినట్లు హరీశ్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ఆయన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరుడికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుంది..
లక్ష్మణ్ గౌడ్ భార్యకు మంచి ఉద్యోగం ఇప్పించే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హరీశ్ రావు స్పష్టం చేశారు. లక్ష్మణ్ గౌడ్ మంచి క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త అని, ఆయనను కోల్పోవడం తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా ఉందన్నారు. ఒక వ్యక్తి మృతిలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయంలో విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు.
జేసీబీ సీజ్ కావడం, పంటలకు నీరు, విద్యుత్ అందకపోవడం, భూమిని ప్రొహిబిషన్ జాబితాలో చేర్చడం వంటి పరిణామాల వల్లే లక్ష్మణ్ గౌడ్ కుటుంబం ఇబ్బందుల్లో పడిందని కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నానని హరీశ్ రావు అన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని కాపాడుకోవడంతోపాటు ఆయన ఆశయాలు కొనసాగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

Read Also :
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వ్యక్తిగత దూషణలు కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చు’
India U19 vs UAE U19: ఆర్యవీర్ సెహ్వాగ్ 160.. యూఏఈ టార్గెట్ 310
ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కేడీ రేవంత్ రెడ్డి : మాజీ ఎమ్మెల్యే గండ్ర
Harish Rao | లక్ష్మణ్ గౌడ్ క్రమశిక్షణ కలిగిన కార్యకర్త.. ఆయన భార్యకు ఉద్యోగం కల్పిస్తాం : హరీశ్ రావు
‘సీతారామ నిర్వాసిత గిరిజన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

