Lingala Ganapuram | చేతి వేళ్లతో గాలిలో గీతలు గీసి ఆపరేషన్ అయిందంటూ.. వేల రూపాయలు వసూలు
Lingala Ganapuram | ఒక గుండె జబ్బు ఉన్న వ్యక్తికి అయితే అతని చాతిపై తన చేతి వేళ్లతో గాలిలో గీతలు గీసి ఆపరేషన్ అయిందంటాడు మళ్లీ బుధ గురువారాల్లో రావాలంటాడు. అందుకోసం కొన్ని మందులు ఇస్తాడు. వేల రూపాయలు వసూలు చేస్తాడు.
Lingala Ganapuram | లింగాల గణపురం.. ఇది ఒక అల్లావుద్దీన్ అద్భుతదీపం కథ.. విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ లో వింత.. హనుమాన్ జంక్షన్ లో ఒక ఆశ్రమం..అందులో ఒక దర్గా.. అక్కడ ఒక బాబా.. చేతిలో ఉన్న గీతలు చూసి ఆ వ్యక్తులకు ఉన్న జబ్బేమిటో.. రోగం ఏమిటో.. ఏ ఆపరేషన్ చేయాలో చెబుతాడట.. ముందుగా 100 రూపాయలు తీసుకుంటాడు.. చేతి గీతలను బట్టి రోగం చెప్తాడు … ఆయా రోగస్థులను ఆయా షెడ్యూల్లో పడుకోబెడతాడు.. ఏవో మంత్రాలు చదువుతాడు.. మరో 200 రూపాయలు తీసుకుంటాడు.. గాలిలో తన చేతి వేళ్లతో గీతలు గీసి ఆపరేషన్ జరిగిందని చెబుతాడు.
ఉదాహరణకు ఒక గుండె జబ్బు ఉన్న వ్యక్తికి అయితే అతని చాతిపై తన చేతి వేళ్లతో గాలిలో గీతలు గీసి ఆపరేషన్ అయిందంటాడు మళ్లీ బుధ గురువారాల్లో రావాలంటాడు. అందుకోసం కొన్ని మందులు ఇస్తాడు. వేల రూపాయలు వసూలు చేస్తాడు. దీంతో జనగామ జిల్లా లింగాపురం మండలం నుండే కాకుండా ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది మచిలీపట్నం ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగుతారు. అక్కడ అప్పటికే రెడీగా ఉన్న ఆటోలో రోగులను ఆశ్రమానికి తీసుకెళ్తారు. ఆ బాబా కనికట్టుల మాయాజాలానికి గురై తిరిగి వచ్చిన వారు కొందరైతే తాము స్కానింగ్ చేయించుకున్నాము ఆపరేషన్ అయినట్లు తేలిందని ప్రచారం చేస్తుండడంతో ఆ ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి మరికొందరు మచిలీపట్నం ట్రైన్ ఎక్కుతూ వేలాది రూపాయలు గుల్ల చేసుకుంటున్నారు.
ఈ విషయంపై మండల వైద్యాధికారి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. మూఢనమ్మకాలను ఎవరూ నమ్మొద్దని మోసపోవద్దని చేతి వేళ్లతో, గాలిలో గీసిన గీతలతో ఆపరేషన్లు జరగవని ప్రజలు మోసపోయి జేబులు లూటీ చేసుకోవద్దన్నారు. లింగాల గణపవరం నుండి వెళ్లిన కొంతమందిని దవాఖానకు పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్య పరుస్తామని ఈ సందర్భంగా డాక్టర్ వివరించాడు.
Read Also :
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకెళ్తున్న నిత్యా రామన్
Flight crash | ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్వేపై పేలిన విమానం.. ఇద్దరు పైలట్లు మృతి..!
Bansuwada | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకే పంపాలి.. బడిబాటలో ఉపాధ్యాయులు
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

